చెన్నూర్: నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. పట్టణంలోని కొత్తగూడెం కాలనీ నుంచి పెద్ద చెరువుకట్ట వరకు రూ.1.40 కోట్లతో నిర్మించిన బైపాస్ రోడ్డును కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ఆదివారం ప్రారంభించారు. మార్నింగ్ వాక్‌లో సాంఘిక సంక్షేమ గురుకు ల, కేజీబీవీ, గిరిజన ఆశ్రమ, బీసీ, మహాత్యా జ్యోతీ బా పూలే, మైనార్టీ గురుకుల పాఠశాలలను సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం 100 పడకల ఆస్పత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. చెన్నూర్ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులకు వ్యాపారులు సహకరించడం అభినందనీయమని పేర్కొన్నారు. రూ.6.50 కోట్లు మంజూరు చేసి రోడ్డు విస్తరణ పనులు చేపడతామని తెలిపారు. రూ.1.20 కోట్లతో 20 గదులతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి నిరుపేద వ్యాపారులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. రోడ్డు విస్తరణలో భూమి కోల్పోయిన అర్హులైన 50మంది వ్యాపారులకు షాపులు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. వసతిగృహాల్లో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ మారుతీప్రసాద్, చైర్ పర్సన్ పెద్దింటి పద్మ, కౌన్సిలర్లు సుంకరి శిరిష, అంబటి శంకర్ పాల్గొన్నారు.


