మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని జెడ్పీ బా లుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహిస్తు న్న ఖేలో ఇండియా బాక్సింగ్ సెంటర్ సమస్యలు పరిష్కరించాలని కోచ్ సీహెచ్ రాజేశ్, క్రీడాకారులు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ను కోరారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఎమ్మెల్యేను కలిసి సమస్యలు వివరించారు. ఇందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, బాక్సింగ్ హాల్, క్రీడా సామగ్రి భద్రపరుచుకునేందుకు గ దులు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కాగా, బా క్సింగ్‌లో రెండున్నరేళ్లుగా పలువురు క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతి భ కనబరిచి పతకాలు సాధించినందుకు వారి తోపాటు కోచ్‌ను ఎమ్మెల్యే అభినందించారు.


