రాష్ట్రస్థాయి పోటీల్లో మెరిసిన అథ్లెట్లు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీల్లో మెరిసిన అథ్లెట్లు

Jul 18 2026 11:57 PM | Updated on Jul 18 2026 11:57 PM

ఆదిలాబాద్‌: మెదక్‌లోని ఇందిరాగాంధీ స్టేడియంలో మెదక్‌ జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ‘4వ తెలంగాణ స్టేట్‌ మిడిల్‌ అండ్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ అథ్లెటిక్స్‌ మీట్‌’లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. మొత్తం ఐదు పతకాలు (3 స్వర్ణాలు, 2 రజతం) సాధించారు. పోటీల్లో పడ్వా ల్‌ పూజ (మహిళల 800 మీటర్లు), రాథోడ్‌ సోను (బాయ్స్‌– అండర్‌ 14 ట్రయాథ్లాన్‌–సి), కోట్నాక్‌ జాకేశ్‌ (బాయ్స్‌–అండర్‌ 14 ట్రయాథ్లాన్‌–ఏ) స్వర్ణ పతకాలు కై వసం చేసుకోగా, తొడసం తుకారం (బాయ్స్‌–14 ట్ర యాథ్లాన్‌–సి), కుమ్రే ఐశ్వర్య (మహిళల 30 00 మీటర్లు) రజతం పతకాలు సాధించి జిల్లా కీర్తిని చాటారు. విజేతలను అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి, డీవైఎస్‌వో దయానంద్‌రెడ్డి, అభినందించారు. రాష్ట్ర అథ్లెటిక్స్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ వెంకటేశ్వర్లు, జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ సెక్రటరీ పి.రాజేష్‌, వి.జి.ఎస్‌ అకాడమీ చైర్మన్‌ వి.జి.ఎస్‌ రాకేశ్‌, పీ.డీలు రాహుల్‌ అగార్కర్‌, లక్ష్మి పాల్గొని విజేతలను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement