జన్నారం: జన్నారం అటవీ డివిజన్ ఇందన్‌న్‌పల్లి రేంజ్ భర్తన్‌పేట్ సెక్షన్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను శని వారం సీజ్ చేసినట్లు రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. పక్కా సమాచారంతో భర్తన్‌పేట్ సెక్షన్ పరిధిలో అటవీసిబ్బంది తనిఖీ చేయగా ఇసుకతో వస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకుని రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం ట్రాక్టర్లను అటవీ శాఖ ఆధీనంలో ఉంచామ ని, ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపా రు. డీఆర్వో విజయ్‌కుమార్, సెక్షన్ అధికారులు శేషారామ్, హన్మంతరావు, బీట్ అధికారులు పొచయ్య, స్వామి, సిబ్బంది పాల్గొన్నారు.


