జైపూర్: రాష్ట్రవ్యాప్తంగా బీసీ జనాభాలో అత్యధికంగా ఉన్న మున్నూరు కాపుల సంఖ్యను తక్కువ చూపే కుట్ర సాగుతుందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ పుట్టం పురుషోత్తం ఆరోపించారు. మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన చెన్నూర్ నియోజకవర్గ స్థాయి మున్నూరుకాపు సంఘం సమావేశంలో మాట్లాడారు. కాపుల విచ్ఛిన్నానికి రాజకీయ పార్టీలు ఎన్నికల్లో వాడుకుంటున్నాయన్నారు. అధిక జనాభా ఉన్న కాపులు రాజకీయ వెనుకబడ్డారని తెలిపారు. సంఘం ద్వారా గ్రామానికి ముగ్గురు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5వేల మందికి ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. గ్రామస్థాయి నుంచి మండలం, జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా కాపుల ఐక్యత చూపించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్రకార్యదర్శి ఇందూరి తిరుపతి, జిల్లా అధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, రాష్ట్రకార్యదర్శి గాదె సత్యం, ఆర్నే సమ్మయ్య, కాసెట్టి కుమార్, జైపూర్, భీమారం, చెన్నూర్, కోటపల్లి మండలాల అధ్యక్షులు సత్యనారాయణ, శ్రీనివాస్, కిష్టయ్య, సమ్మయ్య పాల్గొన్నారు.


