ఆర్టీసీ బస్సులో సీటు కోసం సిగపట్లు! | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సులో సీటు కోసం సిగపట్లు!

Dec 30 2023 1:24 AM | Updated on Dec 30 2023 9:53 AM

- - Sakshi

ఆర్టీసీ బస్సులో కొట్టుకున్న మహిళలు

మహబూబాబాద్‌: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు సిగపట్లు పట్టుకున్నారు. ఈ ఘటన వరంగల్‌ జిల్లాలో శుక్రవారం జరిగింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో మహిళలంతా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేస్తుండడంతో బస్సులన్నీ రద్దీగా ఉంటున్నాయి. వరంగల్‌ నుంచి నర్సంపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మొదట ఓ మహిళ సీటు కోసం రుమాలు వేసింది.

ఆమెకంటే ముందు ఎక్కిన మరో మహిళ ఆ సీటులో కూర్చుంది. బస్సు నర్సంపేట రూట్‌లో వెళ్తుండగానే ఆ తరువాత ఎక్కిన మొదటి మహిళ నా సీటులో ఎలా కూర్చుంటావంటూ ప్రశ్నించింది. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. ఆ తరువాత మరో మహిళ వచ్చి మా సీట్లో కూర్చున్నావంటూ అడిగింది. వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగి కొట్టుకున్నారు. తోటి ప్రయాణికులు వారిని ఆపారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది.

ఇవి చ‌ద‌వండి: ఇండ్లు.. రేషన్‌కార్డులకే ఎక్కువ!

Advertisement
 
Advertisement
Advertisement