సంక్షేమం, అభివృద్ధే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

సంక్షేమం, అభివృద్ధే లక్ష్యం

Aug 16 2026 5:27 AM | Updated on Aug 16 2026 5:27 AM

మహబూబాబాద్‌
ఆదివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2026

7

సాక్షి, మహబూబాబాద్‌: పేదల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ.. జిల్లాను విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్‌, డోర్నకల్‌ ఎమ్మెల్యే జాటోత్‌ రాంచంద్రు నాయక్‌ అన్నారు. మహబూబాబాద్‌ పట్టణంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో శని వారం నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీ య జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసపత్రాలు అందజేశారు. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

సంక్షేమ పథకాలు..

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని విప్‌ రాంచంద్రునాయక్‌ అన్నారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు దాదాపు పూర్తి చేసుకున్నామని, రెండో విడతలో నియోజకవర్గానికి 2,000 ఇళ్ల చొప్పున అందజేస్తామని, 1078 గుడిసెల్లో నివసిస్తున్న వారికి నూతన ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామని అన్నారు. పౌరసరఫరాల శాఖ ద్వారా 558 చౌకదుకాణాల్లో మూడు నెలలకు 15,769 టన్నుల సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని చెప్పారు. 41,424 కొత్తకార్డులు, 50,935 కుటుంబ సభ్యుల నమోదు కార్డులు మంజూరు చేస్తున్నామని అన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా స్మార్ట్‌రేషన్‌ కార్డులు అందజేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చె ప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఎల్పీజీ గ్యాస్‌, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, క్రమం తప్పకుండా ప్రతీ నెల వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, కులవృత్తుల కార్మికులకు పింఛన్లు అందజేస్తున్నామని చెప్పారు. గిరిజన సంక్షేమం, షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమం కోసం నిధు లు విడుదల చేస్తున్నామన్నారు. బ్యాంకు లింకేజీ, వడ్డీలేని రుణాలు అందిస్తూ మహిళా సాధికారత కోసం పాటుపడుతున్నామని అన్నారు.

కాలానుగుణంగా వ్యవసాయం..

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నామని ప్రభుత్వ విప్‌ అన్నారు. 99రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మట్టి పరీక్షలు నిర్వహించామని అన్నారు. రైతు భరోసా కింద 2,14,625 మంది రైతులకు రూ.268కోట్లు అందజేశామని, రైతు బీమా పథకం ద్వారా 687 మంది చనిపోయిన రైతుల కుటుంబాల ఖాతాల్లో రూ.34కోట్లు జమచేశామని చెప్పారు. మిషన్‌ వైవిధ్యం కార్యక్రమంతో స్వల్పకాలిక రకాల సాగును ప్రోత్సహించడం, ఆరుతడి పంటలకు అవసరమైన ప్రోత్సాహకాలు, సలహాలు ఇస్తున్నామని అన్నారు. ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ ద్వారా బిందు, తుంపర్ల సేద్యం, పండ్లతోటల పెంపకంతో పాటు ఆయిల్‌పామ్‌ సాగు వైపు రైతులను మళ్లించి లాభాల బాటలో నడుపుతున్నామని చెప్పారు.

ప్రభుత్వ వైద్యంపై భరోసా..

ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు భరోసా కల్పించేలా వైద్య సేవలు అందిస్తున్నామని విప్‌ చెప్పారు. జిల్లాలోని 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 173 సబ్‌ సెంటర్లు, ఒక బస్తీ దవాఖాన, రెండు సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రి ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ ద్వారా ఉచితంగా పరీక్షలు చేసి ప్రజలపై ఆర్థిక భారం తగ్గించామని ఆన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెరిగిన ప్రసవాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.

ఎన్టీఆర్‌ స్టేడియంలో జాతీయ జెండా ఎగురవేస్తున్న ప్రభుత్వ విప్‌

రాంచంద్రు నాయక్‌, చిత్రంలో కలెక్టర్‌ స్నేహశబరీష్‌, ఎస్పీ శబరీష్‌ తదితరులు

విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు పెద్దపీట

త్యాగాల స్ఫూర్తితో ప్రజా పాలన

ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే రాంచంద్రునాయక్‌

జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement