ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

Aug 16 2026 5:27 AM | Updated on Aug 16 2026 5:27 AM

మహబూబాబాద్‌ అర్బన్‌ : జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో 80వ స్వాతంత్య్ర వేడుకల్లో విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కేసముద్రం, చిన్నగూడురు కేజీబీవీ విద్యార్థినులు, అనంతారం మోడల్‌ స్కూల్‌, సోషల్‌ వెల్ఫేర్‌ గురులకు పాఠశాల, మానుకోట జెడ్పీహెచ్‌ఎస్‌ బాలికల పాఠశాల విద్యార్థినులు పలు జాతీయ గీతాలకు నృత్యాలు చేశారు. గిరిజన ఆశ్రమ పా ఠశాల విద్యార్థినులు యోగాసనాలను నృత్య రూ పం ద్వారా ప్రదర్శించారు. డీఈఓ సత్యనారాయణమూర్తి, జీసీడీఓ గాయత్రి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. విద్యార్థులకు విప్‌ రాంచంద్రునాయక్‌, కలెక్టర్‌ స్నేహ శబరీష్‌, ఎస్పీ శబరీష్‌ బహుమతులు అందజేశారు.

స్టాళ్ల సందర్శన..

పలు శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలకు సంబంధించిన స్టాళ్లను ఏర్పా టు చేశారు. వాటిని ప్రభుత్వ విప్‌ రాంచంద్రునాయక్‌, కలెక్టర్‌ స్నేహ శబరీష్‌, ఎస్పీ శబరీష్‌ సందర్శించారు. కూరగాయాల సాగుపై జిల్లా అధికారి మరియన్న వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement