కోసిగి: గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం కోసిగిలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌ను ఎత్తివేస్తాం..ఇంటికి వెళ్లండంటూ వార్డెన్ జయరాముడు విద్యార్థులకు సూచిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక అయోమయంలో పడ్డారు. హాస్టల్‌ను ఎత్తి వేసి ఆ స్థానంలో గురుకుల బాలికల పాఠశాల ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వార్డెన్ చెబుతున్నారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు కలిసి వార్డెన్‌తో వాగ్వాదం చేశారు. ఎలాంటి సమాచారం లేకుండానే పిల్లలను ఇంటికి వెళ్లమని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌ను యథాతథంగా కొనసాగించాలని, కొత్తగా చేరే విద్యార్థులకు అవకాశం కల్పించాలన్నారు. గురుకుల బాలికల పాఠశాలను కోసిగిలోనే మరో ప్రాంతంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.


