వైఎస్సార్‌సీపీని మరింత బలోపేతం చేద్దాం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీని మరింత బలోపేతం చేద్దాం

Jul 27 2026 1:54 AM | Updated on Jul 27 2026 1:54 AM

వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి

ఓర్వకల్లు: గ్రామాల్లో వైఎస్సార్‌సీపీని మరింత బలోపేతం చేద్దామని పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇటీవల పార్టీ అనుబంధ విభాగాల్లో జిల్లా, రాష్ట్ర హోదాల్లో పదవులు దక్కించుకున్న నాయకులకు ఆదివారం దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్‌సీపీ ఐటీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఓర్వకల్లు గ్రామానికి చెందిన కాశిరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి నియామకమైన సందర్భంగా ఆయన స్వగృహానికి పెద్ద ఎత్తున కార్యకర్తలతో కాటసాని, ఆయన తనయుడు వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాటసాని శివనరసింహారెడ్డి వచ్చారు. వారికి గజమాలతో విష్ణువర్ధన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. కార్యక్రమంలో కర్నూలు మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మీదివేముల ప్రభాకర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, నాగలింగేశ్వరరెడ్డి, నియోజకవర్గ ఐటీ విభాగం అధ్యక్షులు శివకృష్ణారెడ్డి, గ్రామ నాయకులు కాశిరెడ్డి స్వామిరెడ్డి, తోట పురుషోత్తంరెడ్డి, జి.గోవిందరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు ఉస్మాన్‌బాషా, యోగీశ్వరరెడ్డి, అబ్రహం, జెల్ల ప్రవీణ్‌, చంద్రారెడ్డి, బషీర్‌, కోటేశ్వరరెడ్డి, అల్లస్వామి, మంజూరుబాషా, జెల్ల కృష్ణ, కుర్వ ఎల్లప్ప, స్వాములు, కృపయ్య, గోపాల్‌రెడ్డి, హరికృష్ణ, రాజు, రాజేష్‌, శివశంకర్‌రెడ్డి, రొక్కం సుధాకర్‌, భాస్కర్‌రెడ్డి, నారాయణరెడ్డి, స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement