ఆస్పరికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా పాత టీడీపీ కార్యకర్తలు తమ ఇబ్బందులను తెలిపేందుకు సిద్ధమయ్యారు. విషయాన్ని ముందుగానే పసిగట్టిన ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి పోలీసులను అడ్డుపెట్టి సతీష్, సంజప్ప, సాయిబాబా, యుగంధర్‌లను గృహనిర్బంధంలో ఉంచినట్లు ప్రచారం ఉంది. ఇప్పటికే అనుకూలంగా ఉన్న కొందరు పోలీసు అధికారులను అడ్డు పెట్టుకుని వీరభద్రగౌడ్ అనుచరులైన పాత టీడీపీ వర్గీయులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు సొంత పార్టీ వర్గాల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


