సొంత పార్టీలోని వర్గపోరు టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అక్రమార్కులకు.. దోచిపెట్టే వాళ్లకే ఆ పార్టీ ముఖ్య నేతలు పెద్దపీట వేస్తుండటంతో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇప్పటికే ఫిర్యాదులతో అధిష్టానం తల బొప్పి కట్టగా.. ఇ | - | Sakshi
Sakshi News home page

సొంత పార్టీలోని వర్గపోరు టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అక్రమార్కులకు.. దోచిపెట్టే వాళ్లకే ఆ పార్టీ ముఖ్య నేతలు పెద్దపీట వేస్తుండటంతో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇప్పటికే ఫిర్యాదులతో అధిష్టానం తల బొప్పి కట్టగా.. ఇ

Jul 26 2026 2:44 AM | Updated on Jul 26 2026 2:44 AM

టీడీపీ నేతల గృహనిర్బంధం

సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఆస్పరి మండలానికి చెందిన టీడీపీ నేతలు సతీష్‌, సంజప్ప, ఇదే మండలంలోని సాయిబాబా, యుగంధర్‌లను ముఖ్యమంత్రి చంద్రబాబు సభకు వెళ్లనివ్వకుండా స్వయంగా టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి వర్గం అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయుష్‌ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి శనివారం మధ్యాహ్నం ఆస్పరి మండలానికి చేరుకున్నారు. ఇదే సందర్భంగా కార్యకర్తల సమావేశం కూడా నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి హాజరుకాకుండా పలువురు టీడీపీ నేతలను ఉదయం నుంచే పోలీసులు గృహ నిర్బంధం చేయడం గమనార్హం.

వీరభద్రగౌడ్‌

అనుచరుల పట్ల వివక్ష

సతీష్‌, సంజప్ప, సాయిబాబా, యుగంధర్‌లు గతంలో ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న బి.వీరభద్రగౌడ్‌ అనుచరులు. గత ఎన్నికల్లో ఆయన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విరుపాక్షి చేతిలో ఓటమిచెందారు. దీంతో వీరభద్రగౌడ్‌ను నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి పార్టీ అధిష్టానం తప్పించింది. ఆయన స్థానంలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వైకుంఠం జ్యోతిని ఇన్‌చార్జిగా నియమించారు. అప్పటినుంచి జ్యోతి తన సామాజిక వర్గంతో పాటు తన ముఖ్య అనుచరులకే పనులు చేసిపెడుతూ పాత టీడీపీ వర్గీయులను దూరం పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా వీరభద్రగౌడ్‌ అనుచరుల పట్ల పూర్తి వివక్షతో వ్యవహరిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

వివాదాస్పదంగా ఆలూరు ఇన్‌చార్జి

వైకుంఠం జ్యోతి తీరు

అసమ్మతి వర్గాన్ని అణగదొక్కే వ్యూహం

చంద్రబాబును కలవకుండా

పోలీసు అస్త్రం

వీరభద్రగౌడ్‌ అనుచరులకు చుక్కెదురు

సోషల్‌ మీడియాలో

వైరల్‌ అవుతున్న పోస్టులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement