● ఇంటి స్థలం
తమదే అంటూ బెదిరింపు
● కన్నీటి పర్యంతమైన శివమ్మబాయి
నందికొట్కూరు: టీడీపీ నాయకులు దౌర్జన్యం శ్రుతిమించి పోయింది. స్థలాలను కబ్జా చేసేందుకు పేదలను బెదిరిస్తున్నారు. అధికారులతో నోటీసులు ఇప్పిస్తున్నారు. వారి ఆగడాలు పెచ్చుమీరడంతో శుక్రవారం జంగంపాడు గ్రామంలో శివమ్మ బాయి కన్నీటి పర్యంతమవుతూ తనకు జరుగుతున్న అన్యాయాన్ని విలేకరులకు వివరించారు. తమకు రెవెన్యూ అధికారులు ఇంటి స్థలాన్ని ఇచ్చారన్నారు. ఈ స్థలంలో టీడీపీ నాయకులు దౌర్జన్యంగా పూరి గుడిసె వేశారని తెలిపారు. ఈ స్థలం కోసం ఇద్దరు గొడవపడి గ్రీవెన్స్‌కు వెళ్లారని, అధికారులు పరిశీలించి పూలు నాయక్‌పై ఈ స్థలం ఉందని తేచ్చి చెప్పారన్నారు. అయితే టీడీపీ నాయకులు కుట్రపన్ని ఇంటి స్థలాన్ని రద్దు చేయాలని అధికారులతో నోటీసు పంపారన్నారు. తన భర్త పూలునాయక్ పక్షవాతం రోగంతో మంచానికే పరిమితమయ్యారని, జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.


