● సరైన పత్రాలు లేని 48 వాహనాలు స్వాధీనం
కర్నూలు: జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ఆపరేషన్ వజ్రప్రహార్‌లో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ సబ్ డివిజన్లలో శనివారం మెగా కార్డెన్ సెర్చ్ ఆపరేషన్(నిర్బంధ తనిఖీలు) నిర్వహించారు. కర్నూలు సబ్ డివిజన్ బి.తాండ్రపాడు గ్రామ శివారులోని ప్రజానగర్ కాలనీ(టీవీ9 కాలనీ), పత్తికొండ సబ్ డివిజన్ పరిధిలోని తుగ్గలి మండలం మారెళ్ల గ్రామం, ఎమ్మిగనూరు సబ్ డివిజన్ పరిధిలోని కడివెళ్ల గ్రామం, ఆదోని సబ్ డివిజన్ పరిధిలో ఆదోని టూటౌన్ ప్రాంతాల్లోని సమస్యాత్మక కాలనీల్లో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. దాదాపు 400 వాహనాలు తనిఖీ చేసి సరైన పత్రాలు లేని 48 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీలు బాబుప్రసాద్, వెంకటరామయ్య, భార్గవి తదితరులు పోలీసు బృందాలకు నాయకత్వం వహించారు.


