ఎక్కడి బిల్లులు అక్కడే! | - | Sakshi
Sakshi News home page

ఎక్కడి బిల్లులు అక్కడే!

Apr 12 2026 2:48 AM | Updated on Apr 12 2026 2:48 AM

చంద్రబాబు ప్రభుత్వంలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు చెల్లించాల్సిన మొత్తం రూ.3,200 ఇప్పటికి పెండింగ్‌లో ఉంది. కర్నూలు జిల్లాలో రూ.1,800 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.1,400 కోట్ల బిల్లులు పెండింగ్‌లోనే ఉండిపోయాయి. రెండేళ్లలో ఉమ్మడి జిల్లా ఉద్యోగులకు లభించిన ప్రయోజనాలు రూ.220 కోట్ల వరకే. ఉద్యోగుల ఆర్థిక బకాయిలకు సంబంధించి ట్రెజరీ నుంచి వెళ్లిన బిల్లులకు మోక్షం లభించడం ఎపుడో అనేది ప్రశ్నార్థకం అయింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల వెతలు అన్ని ఇన్నీ కావు. 2024 జూన్‌లో పదవీ విరమణ చేసిన వారికి 10 నెలల సెలవు వేతనం, గ్రాడ్యుటీ, కమిటేషన్‌ తదితర ఆర్థిక బెనిఫిట్స్‌ వందలాది మందికి ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉండిపోయాయి. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బెనిఫిట్స్‌ నెలల తరబడి పెండింగ్‌లో పెట్టినప్పటికీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు పట్టించుకోకపోవడం లేదు. ఆర్థిక ప్రయోజనాల కోసం రిటైర్డ్‌ ఉద్యోగులు రొడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement