నేను రూ.50వేలు కౌలుతో 4 ఎకరాలు తీసుకుని అరటి పంట సాగు చేశా. రూ.10 లక్షల దాకా పెట్టుబడి వచ్చింది. పంట బాగానే పండినా ధరల్లేవు. యుద్ధంతో ధరలు పూర్తిగా పడిపోయాయి. టన్ను రూ.20 వేలకు పైగా ధరలు యుద్ధం కారణంగా ఇప్పుడు రూ.4 వేలకు పడిపోయింది. ఇప్పటి వరకు రూ.2.50 లక్షలు మాత్రమే చేతికొచ్చింది. పెట్టిన పెట్టుబడులు కూడా రాలేదు. పంట కోనుగోలుకు వ్యాపారులు ఎవరూ రాక దిక్కుతోచడం లేదు. నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలి.
– ఆకుల శ్రీనివాసులు, కౌలు రైతు, తుగ్గలి


