బనగానపల్లె రూరల్: బనగానపల్లె పట్టణంలోని నంద్యాల రోడ్డులో యనకండ్ల వాగు వంతెన వద్ద ఓ యువకుడు బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం మేరకు.. బనగానపల్లెలోని కొండపేట కాలనీకి చెందిన గౌండ పని చేసే రవితేజ నంద్యాల రోడ్డులోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో ఉన్న స్విమ్మింగ్‌పూల్ వద్దకు సరదాగా ఈతకు వెళ్లాడు. సమీపంలోని రౌండ్ల వద్ద నివాసం ఉంటున్న ఓ మహిళ తన 13 ఏళ్ల కూతు రు, ఎనిమిదేళ్ల కుమారుడిని వెంట తీసుకుని పొలం పనులకు వెళ్లింది. మధ్యాహ్నం సమయంలో ఇద్దరు పిల్లలను ఇంటికి వెళ్లమని చెప్పడంతో వారు నడుచుకుంటూ బయల్దేరారు. అయితే స్విమ్మింగ్‌పూల్ నుంచి ఇంటికి బయల్దేరిన రవితేజ మార్గమధ్యలో బాలికకు మాయ మాటలు చెప్పి సమీపంలో ఉన్న వంతెన కిందకు తీసుకెళ్లి అత్యాచారయత్నం చేయబోయాడు. బాలిక వెంట ఉన్న తమ్ముడు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకొని బాలికను రక్షించారు. నిందితుడికి దేహశుద్ధి చేసి బనగానపల్లె పోలీసులకు అప్పగించారు. ఈ మేర కు గాయపడిన బాలికను స్థానిక వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కల్పన తెలిపారు.
యువకుడికి దేహశుద్ధి
పోలీసులకు అప్పగింత


