జీడీపీకి ఎల్లెల్సీ నీరు | - | Sakshi
Sakshi News home page

జీడీపీకి ఎల్లెల్సీ నీరు

Apr 11 2026 4:13 PM | Updated on Apr 11 2026 4:13 PM

గోనెగండ్ల: తుంగభద్ర దిగువ కాలువ నీటిని అధికారులు గాజులదిన్నె ప్రాజెక్టు(జీడీపీ)లోకి మళ్లించారు. గోనెగండ్ల సెక్షన్‌కు చేరిన నీటిని 50 క్యూసెక్కుల నీరు ఎస్కేప్‌ చానల్‌ ద్వారా గాజులదిన్నె ప్రాజెక్ట్‌కు మళ్లించారు. డోన్‌, పత్తికొండ, దేవనకొండ తదితర ప్రాంతాలకు తాగునీరు సరఫరా చేసేందుకు ఎల్లెల్సీ ద్వారా నీటి ని జీడీపీలోకి మళ్లించినట్లు ఏఈ మహమ్మద్‌ అలీ శుక్రవారం తెలిపారు. అలాగే జీడీపీ కుడి కాలువ ద్వారా 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం జీడీపీలో 1.8 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement