మోపిదేవి: మండలంలోని మోపిదేవి–1 బుక్‌కీపర్ పరిధిలో 14స్వశక్తి సంఘాల రుణాల చెల్లింపులో చోటుచేసుకున్న అవకతవకలపై సోమవారం స్త్రీనిధి జిల్లా ఏజీఎం మునిరత్నం విచారణ చేపట్టారు. గ్రూపు సంఘ సభ్యులతో సమావేశం నిర్వహించగా కేవలం మూడు గ్రూపుల సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఈసందర్భంగా మునిరత్నం మాట్లాడుతూ వ్యక్తిగత కారణాలతో సీసీ హాజరు కాలేదని, ఏపీఎం ప్రత్యేక సమావేశం నిమిత్తం మచిలీపట్నం వెళ్లినందున హాజరుకాలేదని తెలిపారు. తదుపరి సమావేశానికి స్వశక్తి సంఘాలతోపాటు సీసీ, ఏపీఎం కూడా తప్పక హాజరుకావాలని ఆయన ఆదేశించారు. విచారణలో భాగంగా ఆయా గ్రూపుల సభ్యులు మాట్లాడుతూ తాము ప్రతి నెలా క్రమంతప్పకుండా నిర్ధేశించిన వాయిదాలను బుక్‌కీపర్‌కు చెల్లిస్తున్నామని, ఇప్పటికే పూర్తిస్థాయిలో చెల్లించామంటూ పలువురు సంఘ సభ్యులు ఏజీంఎ దృష్టికి తీసుకెళ్లారు. రుణాలు చెల్లించిన రసీదులు అందజేయాలని ఏజీఎం కోరారు. అవకతవకలపై పూర్తి వివరాలు బయటకు రావాలంటే బుక్‌కీపర్‌తోపాటు స్వశక్తి సంఘ సభ్యులు, సీసీ, ఏపీఎం విచారణకు సహకరించాలని ఏజీఎం ఆదేశించారు. జిల్లా కమిటీ సభ్యులు, బుక్‌కీపర్, పలు గ్రూపుల సభ్యులు పాల్గొన్నారు.
ఎఫ్‌సీఐ ఆధ్వర్యంలో దక్షిణ భారత సాంస్కృతిక పోటీలు
విజయవాడ కల్చరల్: భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ఆధ్వర్యంలో దక్షిణ మండల అంతర్ ప్రాంతీయ పోటీలకు విజయవాడ వేదికై ంది. రెండు రోజులపాటు సాగే ఈ పోటీలు విజయవాడలో మాకినేని బసవ పున్నయ్య విజ్ఞానకేంద్రంలో సోమవారం ప్రారంభమయ్యాయి. తమిళనాడు, కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దక్షిణ మండల జోనల్ కార్యాలయానికి చెందిన ఉద్యోగులు ఈ పోటీలలో పాల్గొన్నారు. సోలో, గ్రూప్ నృత్యాలను, హిందీ, తెలుగు, చిత్రగీతాలను, లఘునాటికలను ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా సౌత్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జస్మినితా లాజరస్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్మినితా లాజరస్ మాట్లాడుతూ ప్రజలకు సేవలను అందించడంలో భారత ఆహార సంస్థ ముందుందన్నారు. శాఖకు సంబంధిన ఉద్యోగులు అంకితభావంతో పనిచేస్తున్నారంటూ అభినందించారు. భారత సాంస్కృతిక సంపద విలువలతోకూడుకున్నదన్నారు. వాటిని పరిరక్షించడంలో బాధ్యతగా భావించాలని సూచించారు. పోటీల సహజమని, ప్రతీ అపజయం విజయానికి తొలి మేలికొలుపు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రీజియన్ జీఎం విజయకుమార్‌యాదవ్, ప్రాంతీయ రీజయన్ జీఎం సమీర్‌కుమార్‌వర్మ పాల్గొన్నారు.


