దేవుడి పేరుతో దందాకు బ్రేక్‌ | - | Sakshi
Sakshi News home page

దేవుడి పేరుతో దందాకు బ్రేక్‌

Sep 13 2026 9:10 AM | Updated on Sep 13 2026 9:10 AM

భవానీపురం(విజయవాడపశ్చిమ): దేవుడి పేరుతో దందా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న కొందరు వ్యక్తులకు మున్సిపల్‌ కమిషనర్‌ ధ్యానచంద్ర బ్రేక్‌ వేశారు. గణనాథుని అడ్డంపెట్టుకుని ఏర్పాటు చేయనున్న ఎగ్జిబిషన్‌, ఫుడ్‌ కోర్ట్‌లను రద్దు చేస్తూ ఆయన శనివారం ఉత్తర్వులు జారీ చేయటం చర్చనీయాంశమైంది. విజయవాడ విద్యాధరపురంలోని లేబర్‌కాలనీ గ్రౌండ్‌లో 72 అడుగుల మట్టి మహా గణపతి విగ్రహాన్ని నెలకొల్పి వినాయక చవితి ఉత్సవాలను జరుపుకునేందుకు మాత్రమే మున్సిపల్‌ కార్పొరేషన్‌ అనుమతులు ఇచ్చింది. వాస్తవానికి లేబర్‌కాలనీ గ్రౌండ్‌లో గత ప్రభుత్వ హయాంలో స్టేడియం నిర్మాణ పనులు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్మాణ పనులు కుంటుపడ్డాయి. ఈ క్రమంలో స్టేడియం కోసం కేటాయించిన మైదానంలో కేవలం క్రీడలకు, వాకింగ్‌కు తప్ప మరే ఇతర పనులకు అనుమతులు ఇవ్వకుండా మున్సిపల్‌ కమిషనర్‌ చర్యలు తీసుకోవాలని ఈ ఏడాది ఫిబ్రవరి 18న జరిగిన కౌన్సిల్‌ సప్లిమెంటరీ ఎజెండాలోని అదనపు అంశాన్ని ఆమోదించడం, తీర్మానించడం కూడా జరిగిపోయింది. అయితే కొందరు గ్రౌండ్‌లో ఎగ్జిబిషన్‌, ఫుడ్‌ కోర్టులు ఏర్పాటు చేసేందుకు పెద్ద ఎత్తున షెడ్లు ఏర్పాటు చేయడం గమనార్హం. ఇది కేవలం దేవుడి పేరు చెప్పుకుని వ్యాపారాలు చేసుకునేందుకు సన్నాహాలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

గతంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేసిన వీఎంసీ

లేబర్‌కాలనీ ఓపెన్‌ గ్రౌండ్‌లో 12 రోజుల పాటు 72 అడుగుల పర్యావరణహిత గణపతి విగ్రహం ఏర్పాటుతో పాటు నాలుగు నుంచి ఐదు ప్రదర్శన (ఎగ్జిబిషన్‌) రైడ్లు, కొన్ని ఫుడ్‌ కోర్టులను నిర్వహించుకునేందుకు డూండీ గణేష్‌ సేవా సమితి నిర్వాహకులకు నగరపాలక సంస్థ అనుమతులు ఇచ్చింది. వాస్తవానికి ఇది కౌన్సిల్‌లో ఫిబ్రవరిలో జరిగిన తీర్మానానికి వ్యతిరేకం. కారణాలేమైనా తాము తొలుత ఇచ్చిన అనుమతులను తక్షణమే అమలులోకి వచ్చేలా రద్దు చేస్తూ కమిషనర్‌ ప్రొసీడింగ్స్‌ జారీ చేయడం విశేషం. 72 అడుగుల పర్యావరణహిత గణపతి విగ్రహానికి ఇచ్చిన అనుమతిని ఎట్టి పరిస్థితిలోనూ ప్రదర్శన రైడ్లు, ఫుడ్‌ కోర్ట్‌లు లేదా ఇతర వాణిజ్య లావాదేవీల అనుమతిగా పరిగణించరాదని ప్రొసీడింగ్స్‌లో పేర్కొన్నారు. అలాగే భారీ వర్షాలు, ప్రజా భద్రత, ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందు ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులకు తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు.

లేబర్‌కాలనీ గ్రౌండ్‌లో ఎగ్జిబిషన్‌, ఫుడ్‌ కోర్ట్‌ల

అనుమతులు రద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement