న్యూస్‌రీల్
ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న హాజరు శాతం బడికి వచ్చింది 92.8 శాతం మంది విద్యార్థులు 99.99 శాతం హాజరు ‘క్యాప్చర్’పై అనుమానాలు
ఎన్టీఆర్ జిల్లాలో
22.68 మి.మీ. వర్షపాతం
విజయవాడలో రోడ్లు జలమయం
3 గంటలపాటు ఏకధాటిగా వాన
70.4మి.మీ. వర్షపాతం నమోదు
శివారు ప్రాంతాలు నీటి మునక
రోడ్లపై నీటితో స్తంభించిన ట్రాఫిక్
దంచికొట్టిన వాన
పటమట(విజయవాడతూర్పు): విజయవాడలో వాన దంచికొట్టింది. ఏకధాటిగా మూగు గంటలపాటు కురిసిన వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్డు నీటితో నిండి వాగులను తలపించాయి. రోడ్లపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శనివారం విజయవాడలో కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఈదురుగాలుతో మూడు గంటలపాటు వర్షం పడింది. 70.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షానికి వీధుల నుంచి ప్రధాన రోడ్ల వరకు వాగులను తలపించేలా ఉప్పాంగి ప్రవహించాయి. నడుములోతు నీళ్లు రోడ్లపైకి చేరటంతో నగరవాసులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. ఒకవైపు రోడ్లపైకి భారీగా చేరిన వర్షపు నీరు.. మరో వైపు విరిగిపడిన చెట్ల కొమ్మలతో ఎక్కడికీ వెళ్లలేని స్థితి నెలకొంది. దీనికితోడు వర్షం కారణంగా నగరంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. బందరు రోడ్డు, ఏలూరు రోడ్డులో ట్రాిఫిక్ నిలిచిపోవటంతో ప్రయాణికులు, వాహన చోదకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం పోలీసులకు కష్టంగా మారింది.
విఫలమైన మాన్సూన్ యాక్షన్ ప్లాన్
విజయవాడ నగరపాలక సంస్థ వర్షాలను తట్టుకునేందుకు మాన్సూన్ యాక్షన్ ప్లాన్ అమలు చేసినప్పటికీ ఫలితం లేదని నగరవాసులు ఆరోపిస్తున్నారు. అవసరమైన ప్రాంతాల్లో 15వ ఆర్థిక సంఘం నిధులు, వీఎంసీ సాధారణ నిధులు, అమృత్ పథకం ద్వారా వచ్చిన రూ.30 కోట్లుతో ఆయా ప్రాంతాల్లో స్ట్రామ్ వాటర్ డ్రెయినేజీ నిర్మాణం, డ్రెయిన్లలో పూడికతీత, నూతన అవుట్ ఫాల్ డ్రెయిన్ల నిర్మాణం చేస్తున్నామని అధికారులు ప్రకటిస్తున్నా అవి పూర్తిస్థాయిలో అమలుకాకపోవటంతో నగరంలో కొద్దిపాటి వర్షానికే డ్రెయిన్లు పొంగిపొర్లుతున్నాయి. వన్‌టౌన్ జెండాచెట్టు సెంటర్, నిర్మలా కాన్వెంట్‌రోడ్డు, బెంజిసర్కిల్ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో పనులు పూర్తికాకపోవటంతో రోడ్లపైకి చేరిన వర్షం నీటితో ప్రజలు అవస్థలు పడాల్సి వస్తోంది.
అక్కరకు రాని ఎంఆర్‌టీలు
విజయవాడ నగరంలో ఎప్పుడు వర్షం వచ్చిన రోడ్లపై నిలిచిన నీటిని తోడేండుకు వీఎంసీ ప్రత్యేకంగా మాన్సూన్ రెస్సాన్స్ టీం (ఎంఆర్‌టీ)ల వ్యవస్థను అమలు చేస్తోంది. నగరంలోని మూడు సర్కిళ్ల పరిధిలోని 286 సచివాలయాల ప్రాంతాల్లో అధికంగా నీళ్లు నిలిచే 42 ప్రాంతాలను గుర్తించారు. సచివాలయ సిబ్బంది, ప్రజారోగ్యం, ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక విభాగం సమన్వయంతో పనిచేసే ఎంఆర్‌టీ బృందాలు ఆయా ప్రాంతాల్లో వాహనాలను, మోటర్లు పెట్టి నీటిని తోడాల్సి ఉంది. అయితే ఈ వ్యవస్థ నిద్రావస్థలో ఉందని విమర్శలు వస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో ప్రైవేటు ట్యాంకర్లు 30కు పైగా ఏర్పాటు చేశారు. వీఎంసీ సాధారణ నిధులు ఒక్కో ట్యాంకర్‌కు రోజుకు రూ.3 వేల చొప్పున ఖర్చుచేస్తున్నారు. ఇన్ని వాహనాలున్నా నగరంలో రోడ్లన్నీ జలమయం అవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సమాజ గమనాన్ని నిర్దేశించేది న్యాయశాస్త్రం
పెనమలూరు: సమాజ గమనాన్ని నిర్దేశించేది న్యాయశాస్త్రమేనని కేంద్ర ప్రభుత్వ లెజిస్లేటివ్ డిపార్ట్‌మెంట్ అడిషనల్ సెక్రటరీ డాక్టర్ రామజోగారావు కాశీభట్ల అన్నారు. సిద్ధార్థ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ లా మొదటి సంవత్సరం విద్యార్థులకు శనివారం జరిగిన పరిచయ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. విద్యార్థులు సంప్రదాయ పద్ధతులతో పాటు డిజిటల్ విధానం ద్వారా చట్టాల్లో వస్తున్న మార్పులను గమనించాలన్నారు. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఉపకుల పతి డాక్టర్ సూర్యప్రకాష్‌రావు మాట్లాడుతూ న్యాయ శాస్త్రం ప్రధాన ఉద్దేశం సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రా తృత్వం వంటి రాజ్యాంగ సూత్రాలు అమలు చేయట మేనన్నారు. ఉపకులపతి డాక్టర్ పి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎస్‌వీడీ సిద్ధార్థ లా కాలేజీ సిద్ధార్థ యూనివర్సిటీలో విలీనమైందన్నారు. బీఏ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సులతో నూతన విద్యా సంవత్సరం ప్రారంభించామన్నారు. లా స్కూల్ డీన్ డాక్టర్ చెన్నుపాటి దివాకర్‌బాబు, ప్రో ఉప కులపతి డాక్టర్ రత్నప్రసాద్, రిజిస్ట్రార్ డాక్టర్ రవిచంద్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో శనివారం 22.68 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా విజయవాడ సెంట్రల్ మండలంలో 72.3 మిల్లీమీటర్లు వర్షం పడింది. విజయవాడ నార్త్‌లో 69.7 మిల్లీమీటర్లు, వెస్ట్‌లో 65.0, ఈస్ట్‌లో 64.6, తిరువూరులో 37.6, ఇబ్రహీంపట్నంలో 26.4, వత్సవాయిలో 19.5, గంపలగూడెంలో 12.4, వీరులపాడులో 9.2, జి.కొండూరులో 4.0, చందర్లపాడులో 2.3, జగ్గయ్యపేటలో 1.3, నందిగామ, మైలవరంలో 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.


