పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌కు 86 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌కు 86 ఫిర్యాదులు

Sep 8 2026 2:11 AM | Updated on Sep 8 2026 12:36 PM

పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌కు 86 ఫిర్యాదులు

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌కు ప్రజల నుంచి 86 ఫిర్యాదులు అందాయి. పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌వి రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబిటీఎస్‌ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా బాధితుల నుంచి సమస్యలు తెలుసుకుని, వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత ఎస్‌హెచ్‌ఓలను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో ️భూ, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలపై 39ఫిర్యాదులు,  భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై ఐదు, వివిధ మోసాలపై ఐదు ఫిర్యాదులు అందాయి. అంతేకాక ️మహిళా సంబంధిత నేరాలపై ఆరు,   కొట్లాటలు ఆరు, ️ దొంగతనాలపై మూడు, ఇతర సమస్యలపై 24 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement