పెడన: మద్యానికి బానిసై డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఇంట్లో ఉన్న గడ్డిమందును తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందిన సంఘటనపై గురువారం పెడన పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని తొమ్మిదో వార్డుకు చెందిన వరుదు వెంకటకృష్ణారావు (55)మద్యానికి బానిసయ్యాడు. గతంలో కూడా ఇంట్లో వారిని డబ్బులు కోసం బెదిరించి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇలాగే బుధవారం మధ్యాహ్నం కూడా ఇంట్లో డబ్బులు ఇవ్వలేదని గడ్డిమందును తాగాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు పెడన పోలీసులు మృతుని భార్య నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెడన ఎస్‌ఐ జి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


