బందరులో ఆకస్మిక తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

బందరులో ఆకస్మిక తనిఖీలు

Sep 4 2026 2:12 AM | Updated on Sep 4 2026 2:12 AM

బందరులో ఆకస్మిక తనిఖీలు

చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యుడు ఈ. లక్ష్మీరెడ్డి బందరులో గురువారం సాయంత్రం పర్యటించారు. నగరంలోని మాచవరం రేషన్‌షాపును పరిశీలించారు. దుకాణంలోని స్టాక్‌ వివరాలపై ఆరా తీసి అనంతరం అక్కడ ఉన్న లబ్ధిదారులతో మాట్లాడారు. రేషన్‌ సరుకులు సక్రమంగా అందుతున్నాయా, లేదా ఏమైనా సమస్యలు ఉన్నాయా ఆరా తీశారు. అనంతరం రేషన్‌షాపులోని స్టాక్‌ రికార్డుల ప్రకారం పరిశీలించారు. అనంతరం వలందపాలెం బీసీ బాలికల వసతిగృహంలో విద్యార్థినులతో మాట్లాడారు. మెనూ ప్రకారం ఆహార పదార్థాలు అందుతున్నాయా, లేదా రుచికరంగా ఉంటున్నాయా అనే అంశాలను వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థినులకు వండిన ఆహార పదార్థాలను రుచి చూశారు. ముస్తాఖాన్‌పేటలోని సాంఘిక సంక్షేమశాఖ నిర్వహణలో ఉన్న సమీ కృత విద్యార్థుల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. ఆ వసతి గృహంలో విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి పి. శివరామప్రసాద్‌, పౌరసరఫరాలశాఖ అధికారులు, ఆయా వసతి గృహాల వార్డెన్లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement