గన్నవరంరూరల్: మండలంలోని చిన అవుటపల్లిలోని డాక్టర్ పిన్నమనేని సిద్ధార్రథ మెడికల్ కళాశాలలో 12వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ బాల్ బ్యాడ్మింటన్ పురుషులు, మహిళా జట్టుల ఎంపిక ఆగస్టు 30 నుంచి బుధవారం వరకు జరిగాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి క్రీడాకారులు తమ ప్రతిభను చూపారు. కృష్ణాజిల్లా పురుషుల జట్టు జీవీ సుబ్బారావు కెప్టెన్, జి.వంశీధర ప్రసాద్, పి.కార్తీక్, ఎం.దామోదర చందు, కె.శ్రీను, ఎ.కార్తిక్, డి.జగదీష్, బి.నరేష్, ఎ.సాయిరాం, కె.రాజేష్, కె.రాజేంద్రబాబు కోచ్‌గా వ్యవహరించనున్నారు. మహిళా జట్టు యు.శ్రీలేఖ, కె.మౌనిక, శ్రీలత, ఎన్.భవాని, రామచంద్రిక, శ్రావణి, మేరీ రత్నకుమారి, పి.భువనేశ్వరీ, జేగువీన రవలి, పి.నాగదుర్గ, కోచ్‌గా ఎం.రాంబాబు, వ్యవహరిస్తారని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వి.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ జట్టు సెప్టెంబరు 4 నుంచి 6 వరకు నెల్లూరు జిల్లా అల్లూరులో జరిగే పోటీలలో ప్రాతినిధ్యం వహించనున్నారు.
జట్లను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వి.భీమేశ్వర్, ఏవో టి.వి. సుబ్బారావులు అభినందించి మాట్లాడారు. పోటీల్లో చక్కటి ప్రతిభ చూపి పతకాలతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. అసోసియేషన్ కార్యదర్శి ఎం.శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.


