మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని కేకే–ఓసీని సింగరేణి డైరెక్టర్(పీఅండ్‌పీ) వెంకటేశ్వర్లు, సీపీ అండ్ సీ మనోహర్ బుధవారం ఏరియా జీఎం రాధాకృష్ణతో కలసి సందర్శించారు. పనులు పరిశీలించి బొగ్గు ఉత్పత్తి, నాణ్యతా ప్రమాణాలు, రవాణాపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉద్యోగులు రక్షణ సూత్రాలు పాటిస్తూ సంస్థ నిర్ధేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. ప్రాజెక్ట్ ఆఫీసర్ రాంబాబు, సేఫ్టీ ఆఫీసర్ పైడయ్య, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ వెంకటేశ్వర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
పర్యావరణాన్ని పరిరక్షించాలి
శ్రీరాంపూర్: పర్యావరణాన్ని పరిరక్షించాలని శ్రీరాంపూర్ జీఎం ఎం.శ్రీనివాస్ తెలిపారు. బుధవారం శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కార్యాలయం ముందు గల ఖాళీ స్థలంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ హెక్టార్ ప్రాంతంలో 5 రకాల 500 మామిడి మొక్కలను నాటుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు అధికారి సీహెచ్.వెంకటేశ్వర్లు, ఇందారం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు అధికారి ఏవీ రెడ్డి, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రెటరీ బాజీ సైదా, అధికారుల సంఘం బ్రాంచ్ అధ్యక్షుడు లక్కాకుల మహేష్ పాల్గొన్నారు.


