కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని ఈఎస్‌ఐ గేటు సమీపంలో ఫారెస్ట్ కార్యాలయానికి వెళ్లే మా ర్గంలోని రోడ్డుకు అడ్డంగా గేటు ఏర్పాటు విషయంలో ఎస్పీఎం అధికారులు, మున్సిపల్ అ ధికారుల మధ్య గురువారం వివాదం చోటుచేసుకుంది. ఎస్పీఎం అధికారులు ప్రజలు రాకపోకలు సాగించే రోడ్డుకు అడ్డంగా గేటు నిర్మించేందుకు ప్రయత్నించడంతో మున్సి పల్, రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. మున్సిపాలిటీ నుంచి అనుమతులు లేకుండా గేటు ఎలా ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించా రు. పనులను మున్సిపల్ అధికారులు నిలిపివేశారు. ఆర్‌ఐ గోపాల్, జీపీవో రాజన్న, మున్సిపల్, ఎస్పీఎం సిబ్బంది ఉన్నారు.


