ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ఏఆర్‌హెడ్ క్వార్టర్స్‌లో ప్రతిష్టించిన గణేశ్ నిమజ్జన వేడుకలకు గురువారం ఎస్పీ నితిక పంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలో నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని, పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. కాగా, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పెద్దవాగు వద్ద నిమజ్జన ఏర్పాట్లను ఎస్పీ బుధవారం రాత్రి వర్షంలోనూ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి సూ చనలు చేశారు. వర్షాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నిర్వాహకులు పోలీసుల సూచనలు, భద్రతా నిబంధనలు పాటించాలని కోరారు.


