కౌటాల: రైతులకు నాణ్యమైన అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు చేపడతామని విద్యుత్ శాఖ డీఈ నాగరాజు అన్నారు. గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘అనధికార కోత.. రైతుల వెత..!’ అనే కథనానికి విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు. కౌటాల మండలం తాటిపల్లి గ్రామ శివారులోని మిర్చి తోటలను వారు పరిశీలించారు. పంటలకు నీటితడులు అందించేందుకు సరిపడా కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని రైతులు కోరారు. త్రీఫేజ్ కరెంట్‌ను 12 గంటలకు పైగా సరఫరా చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అనంతరం గుండాయిపేట సబ్‌స్టేషన్‌ను పరిశీలించారు. ఆయన వెంట విద్యుత్‌శాఖ టెక్నికల్ ఏఈ జగన్‌మోహన్, ఏడీఈ ఇర్ఫాన్, సిబ్బంది ఉన్నారు.


