ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఈ నెల 26న ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి అనూష తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోర్టు హాల్‌లో గురువారం బ్యాంకర్లు, నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థల ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రీ లిటిగేషన్, బ్యాంకింగ్‌కు సంబంధించిన అధిక కేసులను పరిష్కరించేందుకు ఈ ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలన్నారు. సంబంధిత కేసుల జాబితాలు, ప్రతిపాదనలను సిద్ధం చేసి లోక్ అదాలత్ విజయవంతం చేసేందుకు సహకరించాలని బ్యాంకర్‌లు, ఆర్థిక సంస్థల ప్రతినిధులకు సూచించారు.


