కనీసం 15 గంటలివ్వాలి | - | Sakshi
Sakshi News home page

కనీసం 15 గంటలివ్వాలి

Sep 24 2026 12:00 AM | Updated on Sep 24 2026 12:00 AM

ఐదెకరాల్లో మిర్చి పంట సాగు చేస్తున్నాను. ఇప్పటివరకు రూ.2లక్షల పెట్టుబడి పెట్టా. ప్రస్తుతం పూత దశలో ఉన్న పంటకు క్రమంగా నీరందిస్తేనే మంచిగా కాత వస్తది. రోజుకు 8 గంటలు కూడా కరెంట్‌ ఉండటం లేదు. వ్యవసాయ బావితోపాటు బోరు ఉన్నా పంటకు నీరు అందించలేకపోతున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం 15 గంటలు నాణ్యమైన కరెంట్‌ సరఫరా చేయాలి.

– సోయం సురేష్‌, తాటిపల్లి, మం.కౌటాల

డిమాండ్‌ పెరిగింది

ఎల్‌నినో ఎఫెక్ట్‌ అన్ని రంగాలతోపాటు విద్యుత్‌ శాఖపై కూడా పడింది. అధిక ఉష్ణోగ్రతలతో కొద్ది రోజులుగా డిమాండ్‌ పెరిగింది. గృహాలతో పాటు సాగునీటి మోటార్ల వినియోగం అధికమైంది. విద్యుత్‌ సరఫరాలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఉన్నతాధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లాం. ఇకపై పంట సాగుకు కోతలు లేకుండా విద్యుత్‌ సరఫరా చేస్తాం.

– ఉత్తమ్‌ జాడె, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement