న్యూస్‌రీల్
కాగజ్‌నగర్‌టౌన్: పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవా రం నిర్వహించిన జిల్లాస్థాయి డ్యాన్స్ పొటీల్లో కాగజ్‌నగర్ మండలంలోని కేజీబీవీ విద్యార్థులు ప్రతిభ చూపి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం ఎమ్మార్సీ భవనంలో ఎంఈవో వాసాల ప్రభాకర్ విద్యార్థులను అభినందించి శాలువాతో సన్మానించారు. గైడెన్స్ అందించిన ఉపాధ్యాయులను ప్రశంసించారు. కార్యక్రమంలో ఎమ్మార్సీ సిబ్బంది మహేశ్, శ్రీకాంత్, సతీశ్ పాల్గొన్నారు.


