ప్రజల హృదయాలను గెలుచుకున్నావు.. | - | Sakshi
Sakshi News home page

ప్రజల హృదయాలను గెలుచుకున్నావు..

Dec 5 2023 5:10 AM | Updated on Dec 5 2023 12:42 PM

- - Sakshi

ఉట్నూర్‌రూరల్‌: రాజకీయాల్లో గెలుపోటములు స హజమని ఎన్నికల్లో ఓడిపోయిన ఖానాపూర్‌ ప్రజల హృదయాలను గెలుచుకున్నావని ఖానాపూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్‌నాయక్‌ను కేటీఆర్‌ అభినందించారు. జాన్సన్‌నాయక్‌ సోమవారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో కేటీఆర్‌ ఎన్నికల సరళిని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో మంచి ఓట్లు సాధించి ప్రజల హృదయాలను గెలుచుకున్నావని కొనియాడారు. ఓటమితో అసంతృప్తి చెందకుండా రానున్న రోజుల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement