ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులు గడువులోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మంగళవారం కళాశాలను సందర్శించి.. తరగతి గదులు, ల్యాబ్‌లు, లైబ్రరీ, హాస్టల్, ఇతర మౌలిక వసతులను పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని సంబంధిత ఇంజినీర్లు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతీ 15 రోజులకు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించాలన్నారు. నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యేను పిన్సిపాల్, ప్రొఫెసర్లు శాలువాతో సన్మానించారు.


