‘క్యాచ్‌ ది రెయిన్‌’పై చిత్రలేఖన పోటీలు | - | Sakshi
Sakshi News home page

‘క్యాచ్‌ ది రెయిన్‌’పై చిత్రలేఖన పోటీలు

Aug 5 2026 1:41 AM | Updated on Aug 5 2026 1:41 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: పెట్రోల్‌ పంప్‌ జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం క్యాచ్‌ ది రెయిన్‌ అంశంపై చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. మున్సిపల్‌ అధికారులు మాట్లాడుతూ ‘వర్షపు చుక్కను ఒడిసిపట్టుకుందాం’ అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. వర్షపు నీటి గుంతల ఏర్పా టు, చెరువుల పరిరక్షణ, భూగర్భ జలాల పెంపు వంటి అంశాలపై విద్యార్థులు ఆకర్షణీయమైన చిత్రాలు గీసి ఆకట్టుకున్నారు. మున్సిపల్‌ అధికారులు యశ్వంత్‌, ఉపాధ్యాయులు తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement