ఆసిఫాబాద్‌రూరల్: మండలంలోని తుంపల్లి ప్రభుత్వ పాఠశాలను మంగళవారం అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ సందర్శించి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వందశాతం హాజ రయ్యేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవా లన్నారు. ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తు న్న నేపథ్యంలో ఉపాధ్యాయుల పనితీరు, విద్యాబోధనపైనే గ్రామాల్లోని పాఠశాలల భవిత ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ బడులపై తల్లిదండ్రులకు నమ్మకం కలిగిస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయులు తమ వృత్తికి న్యాయం చేయాలని సూచించారు.


