హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. చివరికి.. | - | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. చివరికి..

Nov 4 2023 1:44 AM | Updated on Nov 4 2023 10:39 AM

- - Sakshi

నరేందర్ (ఫైల్)

సాక్షి, కుమరం భీం: తీవ్రజ్వరంతో ఒకరి మృతి చెందిన ఘటన మండలంలోని చింతగూడ గ్రా మంలో చోటు చేసుకుంది. కుటుంబ స భ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన అనుమాల నరేందర్‌ (25) రెండేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన శ్రీవల్లిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఐదు నెలల పాప ఉంది. నరేందర్‌ హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 20 రోజుల క్రితం జ్వరం వచ్చింది. ఆసుపత్రుల్లో చూపెట్టుకున్న తగ్గలేదు. మూడు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. పరిస్థితి విషమించడంతో గురువారం కరీంనగర్‌ అసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్సపొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement