‘డబుల్‌’ వాసుల దారి కష్టాలు | - | Sakshi
Sakshi News home page

‘డబుల్‌’ వాసుల దారి కష్టాలు

Aug 9 2026 1:46 AM | Updated on Aug 9 2026 1:46 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: పట్టణంలోని చారిగాం గ్రామంలోగల డబుల్‌ బెడ్రూం ఇళ్లకు వెళ్లేందుకు సరైన రోడ్డు లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు తాత్కాలికంగా వేసిన మట్టి రోడ్డు బురదతో నిండి ద్విచక్రవాహనాలు, ఆటోలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రాత్రి వేళ బురదలో పడి పలువురు గాయాలపాలైన ఘటనలున్నాయి. విద్యుత్‌ స్తంభాలు వేసినా స్ట్రీట్‌ లైట్లు లేక రాత్రి వేళ ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని డబుల్‌ బెడ్రూం ఇళ్ల నివాసాల వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా స్పందించి సీసీ రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement