చేయూతకు కసరత్తు | - | Sakshi
Sakshi News home page

చేయూతకు కసరత్తు

Aug 9 2026 1:46 AM | Updated on Aug 9 2026 1:46 AM

● ఈ నెల 15నాటికి అర్హుల ఎంపిక ● తొలుత ఏడు విభాగాల వారికే.. ● తర్వాత వృద్ధులు, బీడీ కార్మికులకు ● ఆశావహుల్లో చిగురిస్తున్న ఆశలు

ఆసిఫాబాద్‌రూరల్‌/ఆసిఫాబాద్‌అర్బన్‌: చేయూ త పింఛన్ల మంజూరుకు ఎట్టకేలకు సర్కారు శ్రీకారం చుట్టింది. ఐదేళ్లుగా పింఛన్‌ కోసం నిరీ క్షిస్తున్న అర్హుల కల నెరవేరనుంది. ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్ల మంజూరుకు ఈ నెల 7న సీఈవో దివ్య దేవరాజన్‌ దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌ నుంచి డీఆర్డీవోలు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరె న్స్‌ నిర్వహించి దరఖాస్తుల స్వీకరణ, అర్హతలు, నిబంధనలు వివరించారు. ఆగస్టు 15నాటికి అర్హులను ఎంపిక చేసి సెప్టెంబర్‌లో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. కాగా, ప్రస్తుతం జిల్లాలోని 15 మండలాల పరిధిలో 53,745 మంది చేయూత పింఛన్‌దారులున్నారు.

ఫలించనున్న ఐదేళ్ల నిరీక్షణ

జిల్లాలో వేలాదిమంది చేయూత పింఛన్‌ కోసం ఐదేళ్లుగా ఆశతో ఎదురుచూస్తున్నారు. అర్హత కలిగిన ద రఖాస్తుదారులతోపాటు కుటుంబ పరిస్థితుల్లో మా ర్పులు వచ్చినవారికీ పింఛన్లు మంజూరు చేయాల ని సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం నూతనంగా విడుదల చేసిన ఫార్మాట్‌లోనే దరఖాస్తు చేయాలని సూచించింది. గతంలో ప్రజాపాలన, మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసినవారూ ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన కొత్త ఫార్మాట్‌లోనే వివరాలు అందించాలి. గతంలో దరఖాస్తులతో పాటు ఇచ్చిన కు లం, ఆదాయం, ఇతర సర్టిఫికెట్లు ఈ కొత్త దరఖాస్తు ఫారా న్ని జత చేసి అందిస్తే సరిపోతుంది.

ఎక్కడ దరఖాస్తు చేయాలంటే..

గ్రామీణ ప్రాంతాలవారు గ్రామపంచాయతీ, మండల పరిషత్‌ కార్యాలయాల్లో, పట్టణ ప్రాంతాలవా రు మున్సిపల్‌ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవా లి. గ్రామపంచాయతీలు, మున్సిపాలి టీల్లో స్వీకరించిన దరఖాస్తులను ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. అనంతరం ఆ ఫైళ్లను డీఆర్డీవో ద్వారా కలెక్టర్‌ పరిశీలనకు పంపి తుది ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపుతారు. దరఖాస్తుల స్వీకరణకు ఎలాంటి చివరి తేదీ లేదు. ఇది నిరంతర ప్రక్రియ అని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో ప్రస్తుత పింఛన్‌ వివరాలు

వృద్ధులు 22,731

వితంతువులు 21,333

దివ్యాంగులు 5,774

ఒంటరి మహిళలు 2,558

చేనేత కార్మికులు 473

గీత కార్మికులు 132

బీడీ కార్మికులు 88

ఫైలేరియా బాధితులు 554

డయాలసిస్‌ బాధితులు 102

అర్హులు సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వ నిబంధనల మేరకు జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్‌ మంజూరవుతుంది. ఎవరైనా దరఖాస్తు చేసుకోనివారు ఉంటే గ్రామపంచాయతీ, మండల పరిషత్‌, మున్సిపల్‌ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ అవకాశాన్ని అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలి.

– దత్తారావ్‌, డీఆర్డీవో

ముందుగా ఏడు రకాల వారికే..

ప్రభుత్వం ముందుగా ఏడు రకాల ప్రత్యేక పింఛన్లకే ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో వితంతువులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్‌ బాధితులు, ఫైలేరియా బాధితులు, చేనేత కా ర్మికులు, గీత కార్మికులు, దివ్యాంగులున్నా రు. వృద్ధాప్య, బీడీ కార్మికుల పింఛన్ల కోసం దరఖాస్తులు తీసుకుంటున్నప్పటికీ వారికి తర్వాత దశలో ప్రాధాన్యం ఇస్తారని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆయా వర్గాలకు చెందిన అర్హులు నిరాశకు గురవుతున్నారు.

2022లో చివరి సారిగా..

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చివరిసారిగా 2022 అక్టోబర్‌లో కొత్త పింఛన్లు మంజూరు చేసింది. వృద్ధాప్య పింఛన్ల మంజూరుకు దరఖాస్తుదారు ల వయస్సు 65ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించింది. అయినా, ఇప్పటివరకు కొత్తవారికి పింఛన్లు మంజూరు చేయలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూ డా రెండేళ్లుగా ఊరిస్తూ వచ్చింది. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. దివ్యాంగుల పింఛన్‌ రూ.4,016 నుంచి రూ.6,016కు, ఇతర పింఛన్లు రూ.2,016 నుంచి రూ.4,016కు పెంచుతామని చెప్పింది. దీంతో జిల్లాలో ఇప్పటివరకు వేలల్లో దరఖాస్తులు వచ్చాయి. కొత్త పింఛన్ల మంజూరుకు జిల్లా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement