రేపు జైల్‌ భరో | - | Sakshi
Sakshi News home page

రేపు జైల్‌ భరో

Aug 9 2026 1:46 AM | Updated on Aug 9 2026 1:46 AM

దహెగాం: క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈనెల 10న జైల్‌ భరో కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఐటీయూ జిల్లా సంయుక్త కార్యదర్శి వెలిశాల కృష్ణమాచారి తెలిపారు. శనివా రం మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి జైల్‌భరో కరపత్రం ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కా ర్పొరేట్‌లకు కొమ్ముకాస్తోందని ఆరోపించా రు. నాలుగు లేబర్‌ కోడ్‌లను వెంటనే రద్దు చేసి స్కీం వర్కర్లకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. జైల్‌భరో కార్యక్రమంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు అధికసంఖ్యలో పా ల్గొని విజయవంతం చేయాలని కోరారు. మ ధ్యాహ్న భోజన కార్మికులు శ్రీలత, పార్వతి, పద్మ, మల్లీశ్వరి, లక్ష్మి తదితరులున్నారు.

విజయవంతం చేయాలి

ఆసిఫాబాద్‌అర్బన్‌: ఈ నెల 10న తలపెట్టిన జైల్‌భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్‌ పిలుపునిచ్చారు. శనివారం జైల్‌భరో ప్రచార కరపత్రాలను కార్మికులతో కలిసి ఆవిష్కరించారు. జిల్లాలోని 15 మండల కేంద్రాలు, రెండు మున్సిపల్‌ కేంద్రాల్లో భారీ నిరసనలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement