ఖమ్మంసహకారనగర్: ఖమ్మంలోని నిర్మల్ హృదయ్ స్కూల్ కరస్పాండెంట్ వంగా సాంబశివారెడ్డి (80) ఆదివారం మృతి చెందాడు. ఆయన తన నివాసంలో గుండెపోటుతో మరణించినట్లు కుటుంబీకులు వెల్లడించారు. గుంటూరు జిల్లా కాల్లిపర మండలం వలభాపురంలో జన్మించిన సాంబశివారెడ్డి ఎమ్మెస్సీ పూర్తయ్యాక కొత్తగూడెంలోని రామచంద్ర కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశారు. ఆ తర్వాత 1978 – 79లో ఖమ్మం ఎన్‌ఎస్‌టీ రోడ్‌లో ఎన్నెస్పీ పిల్లల కోసం నిర్మల్ హృదయ్ స్కూల్‌ను ప్రారంభించి.. వేలాది మందిని తీర్చిదిద్దారు. కాగా, సాంబశివారెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు సుధాకర్‌రెడ్డి, రవిభరత్‌రెడ్డి ఉన్నారు. ఆయన మృతిపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, పలు పార్టీల నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, బాగం హేమంతరావు, దండి సురేశ్, తమ్మినేని వీరభద్రం, పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు, ప్రైవేట్ పాఠశాలల సంఘం జిల్లా అధ్యక్షుడు గుర్రం కాంతారావుతో పాటు పలు విద్యాసంస్థల చైర్మన్లు మల్లెంపాటి శ్రీధర్, శ్రీవిద్య, రవిమారుత్, గుండాల కృష్ణ, వీరన్న, ఉషాకిరణ్‌కుమార్, వెంకటేశ్వరరావు, సీహెచ్‌జీకే ప్రసాద్ తదితరులు సంతాపం ప్రకటించారు.


