నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు

Aug 12 2026 12:34 AM | Updated on Aug 12 2026 12:34 AM

కొణిజర్ల: విద్యార్థులకు బోధన, నాణ్యమైన భోజ నం సమకూర్చే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని వైరా ఎమ్మెల్యే రాందాస్‌ నాయక్‌ అన్నారు. కొణిజర్ల సమీపాన కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో చదివే చల్లా హేమశ్రీ ఆది వారం రాత్రి మృతి చెందగా ఎమ్మెల్యే, సుడా చైర్మన్‌ పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ మంగళవారం పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు అందుతున్న విద్య, వైద్యం, వసతి సౌకర్యాలపై ఎస్‌ఓ సౌజన్యతో చర్చించడమే కాక బాలికలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలికల ఆరోగ్యం, భద్రతపై శ్రద్ధ చూపుతూనే ప్రభుత్వం కలిపిస్తున్న సదుపాయాలు అందజేసే బాధ్యత ఉపాధ్యాయులదేని తెలిపారు. ఆతర్వాత గిరిజనఆశ్రమ పాఠశాలలో కూడా ఎమ్మెల్యే తనిఖీ చేశారు. అనంతరం కొణిజర్ల మండలం బస్వాపురంలో విద్యార్థి హేమశ్రీ కుటుంబాన్ని కూడా ఎమ్మెల్యే, సుడా చైర్మన్‌ పరామర్శించా రు. ఆమె తల్లిదండ్రులు మౌనిక – రమేష్‌ను పరా మర్శించడమే కాక ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్‌ చల్లా వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు సవళ్ల నాగేశ్వరరావు, నాయకులు వడ్డె నారాయణ రావు, సూరంపల్లి రామారావు, రాంపూడి రోశయ్య, కోసూరి శ్రీనివాసరావు, రాయల పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

కేజీబీవీ, ఆశ్రమ పాఠశాలలను

తనిఖీ చేసిన ఎమ్మెల్యే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement