●మధిర సమీపాన బిహార్ వాసి మృతదేహం
మధిర:మధిరలోని పీవీఆర్ కల్యా ణ మండపం దగ్గర మంగళవారం ఉదయం ఓ వ్యక్తి మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. సదరు వ్యక్తిని ఇత ర ప్రాంతంలో హత్య చేసి ఇక్కడకు తీసుకొచ్చినట్లు భావి స్తుండగా, మధిర– వైరా ప్రధాన రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మధిర టౌన్ సీఐ రమేష్, సిబ్బంది చేరుకుని పరిశీ లించాక మృతుడి ముఖం, చేతులపై రక్తపు మరకల ను గుర్తించారు. ప్రధానరహదారికి సుమారు 50 అడు గుల దూరాన మృతదేహం ఉండడంతో ఇది రోడ్డు ప్రమాదం కాదని, హత్యేనన్న అంచనాకు వచ్చారు.
బిహార్ వాసి.. ఖమ్మంలో నివాసం
బిహార్ రాష్ట్రంలోని ముజాఫూర్ జిల్లాకు చెందిన ఎండీ.తలీమ్(45) ఖమ్మం గట్టయ్యసెంటర్‌లోని ఒక బొటిక్ దుకాణంలో ఎంబ్రాయిడరీ వర్కర్‌గా పని చేస్తున్నాడు. ఆయన ఇటీవల మద్యానికి బానిస కాగా, ఖమ్మం నుంచి బస్సులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం ఊటుకూరు వెళ్లినట్లు టికెట్ల ద్వారా గుర్తించారు. ఆపై బస్సులో సోమవారం మధిరకు చేరుకున్న ఆయన సోమవారం రాత్రి బస్టాండ్ సమీపంలోని పూల దుకాణం వద్ద తిరగగా 11–30 గంటలకు ఫోన్ స్విచాఫ్ అయినట్లు తేలింది. ఆయనను గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి హత్య చేసి వైరా రోడ్డులోని ఖాళీ ప్లాట్‌లో మృతదేహాన్ని పడేసి ఉంటారని తెలుస్తోంది. గంజాయి మత్తులో ఎవరైనా హత్య చేశారా, ఇతర కారణాలు ఉన్నాయా అనేది తేల్చేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా, తలీమ్‌కు భార్య, నలుగురు కుమారులు ఉండగా కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ రమేష్ తెలిపారు.


