●నివాళులర్పించిన మాస్‌లైన్ నేతలు
ఖమ్మంమయూరిసెంటర్: దాదాపు 30 ఏళ్ల పాటు అడవిలో సాయుధ సభ్యురాలుగా పనిచేసిన గంగసాని సీతక్క(సరోజిని) విప్లవోద్యమ నాయకురాలు అని మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పేర్కొన్నారు. ఆమె అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందగా ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో నివాళులర్పించారు. అనంతరం రంగారావు మాట్లాడుతూ సీతక్క సీని యర్ నేత ధర్మన్న జీవిత సహచరి కాగా, 15 ఏళ్లుగా అనారోగ్యం, వృద్ధాప్య కారణాలతో బయట ఉంటున్నారని తెలిపారు. పార్టీ జిల్లా కార్యదర్శి సీ.వై.పుల్లయ్య, నాయకులు సభ్యులు జి.రామ య్య, ఆవుల వెంకటేశ్వర్లు, ఆవుల అశోక్, సీహెచ్.శిరోమణి, టీ ఝాన్సీ, పి శోభ, శివకుమార్, కొత్తపల్లి రేణుక, పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాయల రవికుమార్, న్యాయవాది కందాల క్రాంతికుమార్‌తో పాటు పోటు శ్రీనివాస్, గంగసాని కృష్ణ, రమాదేవి తదితరులు కూడా సీతక్క మృతదేహం వద్ద నివాళులర్పించారు.


