కారేపల్లి: ఆపదలో ఉన్న స్నేహితుల కుటుంబానికి చిన్ననాటి మిత్రులు అండగా నిలిచారు. మండలంలోని మాధారం గ్రామానికి చెందిన రమేశ్ తల్లి లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ క్రమాన రమేశ్‌తో కలిసి మాధారం కేవీ విద్యానికేతన్‌లో 10వ తరగతి చదివినవారు ఆయనకు శనివారం రూ.27 వేలు అందించారు. అలాగే, గుంపెళ్లగూడెంనకు చెందిన వీరన్న మృతి చెందడంతో ఆయన కుమార్తె పేరిట రూ.1.10 లక్షలను డిపాజిట్ చేసి బాండ్ అందజేశారు. కార్యక్రమంలో కేవీ విద్యానికేతన్ కరస్పాండెంట్ కప్పెర రంగారావు, పూర్వ విద్యార్థులు బాదావత్ రవి, అజ్మీరా నరేశ్, బోడ రమేశ్‌నాయక్, అజ్మీరా సురేశ్, బట్టు వీరు, బాలు, లచ్చు, బానోతు నగేశ్, దుంపటి గోవింద్, పోతనబోయిన ఉమారావు, రాంబాబు, అజ్మీరా రజిని తదితరులు పాల్గొన్నారు.
గురుకులాల సమస్యలు పరిష్కరించాలి
మధిర: గురుకులాల్లోని సమస్యలే కాక ఉపాధ్యాయుల డిమాండ్లను పరిష్కరించాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మధిరతో పాటు పలు గురుకులాల్లో శనివారం పరిశీలించిన ఆయన ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా ఉన్న టైం టేబుల్‌ను మార్చడమే కాక ఉపాధ్యాయులకు నైట్‌డ్యూటీలు తొలగించి వార్డెన్లను నియమించాలన్నారు. అంతేకాక 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లిస్తూ హెల్త్ కార్డులు ఇవ్వాలని, జూనియర్ కళాశాలల అధ్యాపకులకు గెజిటెడ్ హోదా కల్పించాలని కోరారు. సమావేశంలో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ నాగూర్ వలీతో పాటు దామోదర్, శాంసన్, బండారు నాగరాజు, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
టీసీసీబీఈఏ
జిల్లా కమిటీ ఎన్నిక
ఖమ్మంవ్యవసాయం: తెలంగాణ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా నాలుగో మహాసభ శనివారం ఖమ్మంలో జరిగింది. సమావేశంలో టీసీసీబీఈఏ రాష్ట్ర చైర్మన్ కనకం జనార్దన్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్‌కే అలీముద్దీన్, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ పాశం నాగేందర్, ప్రధాన కార్యదర్శి బి.ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించగా, సహకార బ్యాంకింగ్ రంగంలో రెండంచెల విధానం, పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మూడేళ్ల కాలానికి గాను జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా ఈ.శాంతిరాగమయి, కార్యదర్శిగా ఎం.రామకృష్ణ, కోశాధికారిగా ఎన్.నాగేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు.
పోలీసు సంక్షేమ సంఘం..
ఖమ్మంక్రైం: జిల్లా పోలీస్ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా హేమనాథ్ (హెచ్‌సీ 2092), ఉపాధ్యక్షులుగా కె.జగదీశ్ (ఎస్‌ఐ), సురేశ్ (ఎస్‌ఐ), కార్యదర్శిగా బి.వీరభద్రం (ఏఆర్ ఎస్‌ఐ) ఎన్నికయ్యారు. అలాగే, సంయుక్త కార్యదర్శిగా కె.సుధాకర్ (పీసీ 2353), ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి.అప్పారావు (ఏఆర్ పీసీ 1172), కోశాధికారిగా నరసింహారావు (పీసీ 2668)తో పాటు కార్యవర్గ సభ్యులుగా వై.వెంకటేశ్వర్లు (పీసీ 1073), వి.వినయ్‌కృష్ణ (పీసీ 498), కె.సురేశ్ (పీసీ 2885), టి.జమలయ్య (ఏఆర్ పీసీ 79), ఎన్.ఏడుకొండలు (ఏఆర్ పీసీ 1387), టి.రేణుక (పీసీ 253) ఎన్నిక కాగా, ఈ కార్యవర్గం మూడేళ్ల పాటు కొనసాగనుంది.
గణిత ఫోరం జిల్లా
అధ్యక్షురాలిగా ఝాన్సీరాణి
బోనకల్: బోనకల్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు గంటెల ఝాన్సీరాణి తెలంగాణ గణితఫోరం జిల్లా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఖమ్మం రిక్కాబజార్ హైస్కూల్‌లో జరిగిన టీఎంఎఫ్ కార్యవర్గ సమావేశంలో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఝాన్సీరాణిని మండల ఉపాధ్యాయులు అభినందించారు.


