కొణిజర్ల: కొణిజర్ల మండలం అంజనాపురంలోని గోద్రెజ్ పామాయిల్ ఫ్యాక్టరీని ప్రారంభించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం వస్తున్న సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. అంజనాపురంలో హెలీపాడ్ నిర్మాణ పనులతో పాటు పామాయిల్ ఫ్యాక్టరీ, సభాస్థలిని ఆయన శనివారం పరిశీలించి సూచనలు చేశారు. ప్రొటోకాల్‌కు అనుగుణంగా సీటింగ్ ఏర్పాట్లు చేసి, మీడియా ప్రతినిధులకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే, వీఐపీ పాసులు అవసరానికి మించి పంపిణీ చేయొద్దని చెప్పారు. సభా ప్రాంగణంలో బారికేడ్లు, ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేసి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్‌డీఓ శ్రీనివాస్, మైనార్టీ సంక్షేమాధికారి ముజాహిద్, డీవైఎస్‌ఓ సునీల్‌రెడ్డి, డీపీఓ రాంబాబు, డీఎంహెచ్‌ఓ రామారావు, ఉద్యాన శాఖాధికారి అనిత, వైరా ఏసీపీ సారంగపాణి, తహసీల్దార్ అరుణ, గోద్రెజ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
అంజనాపురంలో పరిశీలించిన
కలెక్టర్ దివాకర


