కామేపల్లి: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారంటీలతో సహా పలు హామీలను దశల వారీగా అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. కామేపల్లి మండలం మద్దులపల్లిలో రూ.2.85 కోట్లతో నిర్మించే 33/11 కే.వీ. విద్యుత సబ్ స్టేషన్, తాళ్లగూడెంలో రూ.8.95 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఇల్లెందు, వైరా ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, రాందాస్‌నాయక్‌తో కలిసి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ప్రతీ గ్రామం, మారుమూల తండాకు పక్కా రవాణా సౌకర్యం కల్పించేలా రహదారులు నిర్మిస్తున్నామని తెలిపారు. రోడ్లు అందుబాటులోకి వస్తే మౌలిక సదుపాయాలు మరింత బలోపేతమై ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. ఇచ్చిన అన్ని హామీల అమలుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యాన వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ, రైతులకు కష్టం రాకుండా చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుందని తెలిపారు. వ్యవసాయరంగానికి నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరం అందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి, కలెక్టర్ దివాకర టీ.ఎస్., రాష్ట్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ డైరెక్టర్ రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, రాష్ట్ర గిడ్డంగులు, సుడా, పీఏసీఎస్‌ల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, పుచ్చకాయల వీరభద్రం, ధనియాకుల హన్మంతరావు, సర్పంచ్‌లు పడిగ నాగమణి, లకావత్ సునీత, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణతో పాటు ఎం. మల్లిబాబు యాదవ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
కారేపల్లి క్రాస్‌లో స్వాగతం
కారేపల్లి: కామేపల్లి మండల పర్యటన అనంతరం ఇల్లెందు మండలానికి వెళ్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కారేపల్లిలో నాయకులు స్వాగతం పలికి సన్మానించారు. సొసైటీ చైర్మన్లు, సర్పంచ్‌లు దుగ్గినేని శ్రీనివాసరావు, బానోతు రామ్మూర్తి, పెద్దబోయిన ఉమాశంకర్, విష్ణువర్దన్‌రెడ్డి, మేదరి టోనీవీరప్రతాప్, అజ్మీరా నరేష్, భీముడు, హీరాలాల్, హన్మంతరావు, నాయకులు తోటకూరి రాంబాబు, దేవ్లానాయక్, అడ్డగోడ ఐలయ్య, ఎండీ.హనీఫ్, యాకూబ్ అలీ, షపీ, ఆదెర్ల రాములు, రాజు, జగ్గయ్య, హేమ్లానాయక్ పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క


