పంటల సాగులో జాగ్రత్త | - | Sakshi
Sakshi News home page

పంటల సాగులో జాగ్రత్త

Jul 19 2026 12:27 AM | Updated on Jul 19 2026 12:27 AM

● వర్షాభావ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోండి ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

● వర్షాభావ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోండి ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

నేలకొండపల్లి: ప్రస్తుత వాతావరణ పరిస్థితులను గమనిస్తూ శాస్త్రవేత్తలు, అధికారుల సూచనల ఆధారంగా రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. నేలకండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో శనివారం మంత్రి పర్యటించారు. కోరట్లగూడెంలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశాక, పలువురికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. అలాగే, కోనాయిగూడెంలో నందిగామ బ్రాంచి కెనాల్‌పై హైలెవల్‌ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి, సధాశివాపురంలో గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఆరెగూడెం సర్పంచ్‌ వడ్డె విశాల కాంగ్రెస్‌లో చేరగా ఆహ్వానించిన మంత్రికి, భక్తరామదాసు ధ్యాన మందిరం అభివృద్ధిపై విద్వత్‌ కళాపీఠం ప్రతినిధులు వినతిప్రతం అందించారు. ఇక నేలకొండపల్లిలో గంగమ్మ జాతరలో పాల్గొన్న పొంగులేటి, బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బోర్ల నీటినే నమ్ముకోవద్దు

నీరు తక్కువగానే అవసరమయ్యే పంటలపై దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి సూచించారు. కేవలం బోరు నీటిపై ఆధారపడి వరి వంటివి సాగు చేస్తే మధ్యలో కొరత ఏర్పడి నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి సాగర్‌లో నీటి లభ్యత పెరిగితే సాగునీటి విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కాగా, ప్రతీ రహదారిని సీసీగా మార్చనుండగా, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విడతల వారీగా కొనసాగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమాల్లో కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌., మార్కెట్‌ చైర్మన్‌ వెన్నపూసల సీతారాములు, నాయకులు, తుంబూరు దయాకర్‌రెడ్డి, కొడాలి గోవిందరావు, బచ్చలకూరి నాగరాజు, జెర్రిపోతుల అంజిని, మేకల వెంకటేశ్వర్లు, బొందయ్య, భద్రయ్య, పెంటమళ్ల పుల్లమ్మ, తిగుళ్ల భవాని, పాకనాటి కన్నారెడ్డి, చెరుకుపల్లి రాజేష్‌ జెర్రిపోతుల సత్యనారాయణ, కడియాల నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement