ఖమ్మంమయూరిసెంటర్/కామేపల్లి: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆది, సోమవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం కామేపల్లి మండలంలోని తాళ్లగూడెం–నర్సయ్య కుంట, కామేపల్లి శ్మశాన వాటిక – కామేపల్లి తదితర మార్గాల్లో రోడ్లు, మద్దులపల్లిలో సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం రొంపేడులో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశాక టేకులపల్లి మండలం ముత్యాలంపాడులో నిర్మాణం పూర్తయిన సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారు.
శ్రీవారికి అభిషేకం,
ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునే గర్భగుడిలో మూలవిరాట్‌తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదా నికి అర్చకులు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారు, అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి భక్తుల నిత్యకల్యాణం, పల్లకీసేవ జరిపించారు. కాగా, ఆలయంలో నియమితులైన ఇద్దరు వేద పండితులు, ఇద్దరు అర్చకులు, మరో ఉద్యోగి విధుల్లో చేరారు. ఈకార్యక్రమంలో ఈఓ జగన్మోహన్‌రావు, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి ‘దోస్త్’ ప్రత్యేక ప్రవేశాలు
ఖమ్మం సహకారనగర్: డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు ఈనెల 20వ తేదీ సోమవారం నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈమేరకు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 20నుంచి 26 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఖమ్మంలోని ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జాకీరుల్లా ఒక ప్రకటనలో తెలిపారు. ఆతర్వాత 27నుంచి వెబ్ ఆప్షన్లు ఇస్తే సీట్ల కేటాయింపు జరుగుతుందని పేర్కొన్నారు. గత మూడు దశల్లో రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు ఈ అవకాశం వినియోగించుకోవాలని, వివరాలకు తమ కళాశాలలోని హెల్ప్ లైన్ సెంటర్‌లో సంప్రదించాలని సూచించారు.
లోక్‌అదాలత్‌లో
175 కేసుల పరిష్కారం
ఖమ్మంలీగల్: జిల్లాలోని కోర్టుల్లో శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. చెక్‌బౌన్స్ కేసుల పరిష్కారం కోసం ఈ ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించగా 175 కేసులు రాజీ ద్వారా పరిష్కరించారు. ఇందులో రూ.49,072,734 విలువైన కేసుల పరిష్కారం జరిగిందని జిల్లా న్యాయ సేవా సంస్థ(డీఎల్‌సీఏ) కార్యదర్శి పి.దేవీమానస తెలిపారు. అంతేకాక జిల్లావ్యాప్తంగా కోర్టుల్లో ప్రీ లిటిగేషన్ కేసులు కూడా పరిష్కరించినట్లు ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా రాజీ పడిన పలువురికి ఆమె అవార్డు అందజేశారు.
విద్యార్థుల హాజరుశాతం పెరగాలి
ఎర్రుపాలెం: పాఠశాలలకు విద్యార్థులంతా హాజరయ్యేలా హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని డీఈఓ జి.సదానందం ఆదేశించారు. మండలంలోని అయ్యవారిగూడెం ప్రాథమిక పాఠశాలను శనివారం తనిఖీ చేసిన ఆయన విద్యార్థుల సామర్ధ్యాలను పరీక్షించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమైన డీఈఓ మాట్లాడుతూ ప్రతీ విద్యార్థికి చదవడం, రాయడం, గణిత పక్రియలు వచ్చేలా బోధించాలని తెలిపారు. తద్వారా విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయని పేర్కొ న్నారు. అలాగే, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం సమకూర్చాలని సూచించారు. భోజనం తయారీని పర్యవేక్షిస్తూ ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూడాలని తెలిపారు. సీఎంఓ ప్రవీణ్, ఎంఈఓ బి.మురళీ మోహన్‌రావు పాల్గొన్నారు.


