సాక్షి, బళ్లారి: నగరంలోని ఐటీఐ కళాశాల మైదానంలో నిర్మాణ్–2026 పేరుతో భారీ కన్‌స్ట్రక్షన్ అండ్ బిజినెస్ ఎక్స్‌పో (కట్టడ సామాగ్రి ప్రదర్శన) శుక్రవారం ప్రారంభమైంది. బళ్లారి అసోసియేషన్ ఆఫ్ సివిల్, ఇంజనీర్స్ అండ్ అర్కెటెక్ట్స్ అసోసియేషన్ సంయుక్తా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు కొనసాగుతుంది. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఎగ్జిబిషన్‌ను జిల్లా అధికారి నాగేంద్ర ప్రసాద్, మేయర్ గాదెప్ప, జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు అవ్వరా మంజునాథ, ప్రముఖ పారిశ్రామికవేత్త, జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ రమేష్ గోపాల్ తదితర ప్రముఖులు ప్రారంభించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన అన్ని ఉత్పత్తులను ఒకే చోట ప్రదర్శనకు ఉంచారు. జిల్లా అధికారి నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఏవైనా నూతన కట్టడాల నిర్మాణంలో ఇంజనీర్లు పాత్ర కీలకం అన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ.. ఇంటి నిర్మాణాలకు సంబంధించి అన్ని పరికరాలు దాదాపు 77 స్టాల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని వర్గాలకు చెందిన వారు ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన సామగ్రి అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. మూడు రోజులు పాటు ఈ ప్రదర్శన ఉంటుందని.. నగర వాసులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.


